telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

సొంత బావను పెళ్లి చేసుకోవాలని.. అడ్డుగా అక్కను హత్య చేసిన చెల్లి!

సొంత బావపై ప్రేమతో రక్తం పంచుకుని పుట్టిన అక్కనే ఓ చెల్లి హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా కైత్రాలో జరిగింది.వెలుగుచూసింది. బావపై మనసు పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు అక్కే అడ్డని భావించి, ఆమెను హత్యచేసి, ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లి, తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసుకుంది. ఆ సమయంలో అక్క గర్భవతని, ఆమె కడుపులోని మరో ప్రాణం కూడా బలవుతుందన్న ఆలోచన లేకుండా దారుణంగా ప్రవర్తించింది.

పోలీసుల కథనం ప్రకారం అభిలాష (27), షతక్షి (19) అక్కాచెల్లెళ్లు కాగా, అభిలాషకి కొంతకాలం క్రితం వివాహమైంది. వివాహం తరువాత ఆమెకు గర్భం రాగా, పురుడు నిమిత్తం పుట్టింటికి వచ్చింది. అప్పటికే బావపై మనసుపడిన షతక్షి, బావను పెళ్లాడాలంటే, అక్కే అడ్డన్న ఆలోచనతో అక్కపై కత్తితో దాడి చేసింది. బాధితురాలు కేకలు పెడుతుండగా, ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి, అభిలాషను ఆసుపత్రికితరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.  

Related posts