telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర

cooking gas price hiked by govt

వంట‌గ్యాస్ ఉప‌యోగిస్తున్న వినియోగదారులకు ఊర‌ట ల‌భించింది. ల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు ప్ర‌తినెలా మారుతూ ఉంటాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధ‌ర‌లు స‌హా రూపాయి మార‌క విలువ‌పై ఆధార‌ప‌డి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్ర‌తినెల ఒక‌టో తేదిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మారుస్తుంటాయి.

ఈ క్ర‌మంలోనే ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 214 త‌గ్గింది. అంటే ప్ర‌స్తుతం వంట‌గ్యాస్ ధ‌ర రూ. 583 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇక కమ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధ‌ర రూ. 988 కి చేరింది. త‌గ్గిన కొత్త ధరలు నేటి నుంచి అమ‌ల్లోకి రానుంది.

Related posts