telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఇస్రోలో .. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..

indians support to isro on chandrayan-2

ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ… ఇస్రో పేరు వినగానే చంద్రయాన్ లాంటి ప్రయోగాలు గుర్తొస్తాయి. ఆ ప్రయోగాల వెనుక వేలాది మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. మీరూ అలాంటి శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? మీకు అవకాశం కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO. ఇస్రో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సైంటిస్ట్ / ఇంజనీర్,ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఈ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 4 చివరి తేదీ.

మరిన్ని వివరాల కోసం https://www.isro.gov.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.

పోస్టుల వివరాలు :
సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ (ఎలక్ట్రానిక్స్)- 131;
సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ (మెకానికల్)- 135;
సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ (కంప్యూటర్ సైన్స్)- 58.

సంస్థ పేరు : ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్
పోస్టుపేరు : సైంటిస్టు,ఇంజినీర్ పోస్టులు,
స్థలం : బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

పోస్టుల వారీగా వివరాలు : సివిల్‌ – 11ఎలక్ట్రికల్ – 05రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ-04, ఆర్కిటెక్చర్‌ – 01మొత్తం పోస్టులు :21
విద్యార్హత అనుభవం : ఇస్రో నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి : 35 సంవత్సరాలకు మించి ఉండకూడదు,
జీతం : 56,100.

Related posts