telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర పౌర విమానయాన శాఖకు కేసీఆర్‌ రిక్వెస్ట్‌…

కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో మర్యాద పూర్వకం గా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని.. వరంగల్ జిల్లా మామునూరులో, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లో .. ఈ ఆరు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం కెసిఆర్ పౌర విమానయాన కార్యదర్శిని ఈ భేటీ సందర్భంగా కోరారు. రాష్ర్టంలో ఎయిర్ స్ట్రిప్ ల మంజూరీ కోసం తాను కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా సిఎం కెసిఆర్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సునీల్ శర్మ, ఈఎన్సీ  రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts