telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గన్ మెన్లను వెనక్కి పంపిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గన్ మెన్లను తిప్పిపంపుతున్నట్టు  ప్రకటించారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, తనకు ఎటువంటి ప్రాణ భయం లేదని తెలిపారు. తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. తన రక్షణను ప్రజలే చూసుకొంటారని రేగా కాంతారావు చెప్పారు.అందుకే గన్ మెన్లను నిరాకరిస్తున్నట్టు చెప్పారు.

హంగూఆర్భాటాలతో ప్రజల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత సిబ్బంది ఆరుగురినీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని కోరారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు.

Related posts