telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కన్నడ హీరో తనయుడు అక్షిత్ హీరోగా ‘సీతాయణం’ ఫస్ట్ లుక్

seetayanam

కన్నడ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా పరిచయమవుతున్నారు. ‘సీతాయణం’ అనే చిత్రంతో కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను అక్షిత్ పలకరించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనహిత భూషణ్ కథానాయిక. రోహన్ భరద్వాజ్ సమర్పణలో కలర్ క్లౌడ్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడతో పాటు, తమిళంలో డబ్బింగ్ చేసి, అన్నీ ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘రెస్పెక్ట్ ఉమెన్ అన్న శీర్షికతో ప్రేమ, క్రైమ్, డ్రామాగా నడిచే చిత్రమిది. కథ, కథనాలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. చిత్రంలోని పాటలు ఆకట్టుకుంటాయి. 63 రోజులపాటు బ్యాంకాక్, బెంగళూర్, మంగళూర్, ఆగుంబే, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో షూటింగ్ జరిపాం. క్లైమాక్స్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌లో నిలుపుతుంది’’ అని తెలిపారు.దర్శకడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ.. ‘‘సీతాయణం, నేటి తరానికి నచ్చేలా.. హృద్యమైన అంశాలు, సన్నివేశాలతో రాసుకున్న కథ. నిర్మాతల పూర్తి సహకారంతో, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో అనుకున్నట్టుగా తెరకెక్కిస్తున్నాం. మా యుంగ్ సుప్రీం హీరో అక్షిత్‌కి ఈ చిత్రం చాలా పెద్ద అవకాశాల్ని తెస్తుంది. హీరోయిన్ అనహిత చాలా బాగా చేసింది. వారిద్దరి జోడి చాలా బాగా కుదిరింది’’ అని అన్నారు.
 

Related posts