telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

మార్చి 2 మంగళవారం దినఫలాలు… దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు

మేషం : చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రావలసిన మొండిబాకీలు సైతం వాయిదాపడతాయి. అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు.

వృషభం : ప్రైవేటు సంస్థల్లో వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోపడతాయి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.

మిథునం : ఆర్థిక లావాదేవీల పట్ల ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో మెళకువ వహించండి. స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆపత్సమయంలో బంధువులు తప్పుకుంటారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరంచేస్తాయి.

కర్కాటకం : ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. మీ బలహీనతలు అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.

సింహం : ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావంచకండి. ఖర్చులు పెరగడంతో రుణాలు చేబదుళ్లు తప్పవు. ధనం సమయానికి అందడం వల్ల మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు.

కన్య : ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. వస్త్ర, పీచు, కళంకారి, బంగారు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.

తుల : ఉద్యోగస్తులకు సభలు, సమావేశాల్లో ప్రముఖులత పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు త్వరలోనే సంతృప్తికరమైన అవకాశాలు లభిస్తాయి. బంగారు, వెండి రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులకు చేయు ప్రయత్నాలు అనుకూలించగలవు.

వృశ్చికం : గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి అవకాశం ఉంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తగలవు. కొబ్బరి, పండ్లు, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.

ధనస్సు : సినిమా, విద్యా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన వ్యక్తుల కలయిక వల్ల మీలో ఉత్తేజం కానరాగలదు. మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణాలు తీర్చడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మకరం : కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాలలో వారికి మిశ్రమ ఫలితం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక కార్మికులకో పరస్పర అవగాహన దైవ, కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరుల కారణంగా మీ పనులు వాయిదాపడతాయి. పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు పురోభివృద్ధి పొందుతారు.

కుంభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలిసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భూముల గురించి చర్చిస్తారు. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు. మీ యత్నాలు సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు.

మీనం : రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల తీరు అసహనం కలిగిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతరం శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం.

Related posts