telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పింఛన్లపై టీడీపీ అనాలోచిత ఆరోపణలు: మంత్రి బొత్స

botsa ycp

పింఛన్లపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనాలోచిత ఆరోపణలు చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన పేదలందరికి ఇంటివద్దకే పింఛన్లను అందించే విధానాన్ని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పింఛన్ల కంటే తాము దాదాపుగా రెండు లక్షల మందికి ఎక్కువగా ఇస్తున్నామన్నారు. కొత్తగా సుమారు 6 లక్షల 10 వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

అర్హులను గుర్తించడంలో పొరబాట్లేమైనా ఉంటే త్వరలోనే సరిదిద్ది వారికి కూడా పింఛన్లు ఇస్తామని మంత్రి తెలిపారు. తాము జన్మభూమి కమిటీలలా వసూలు దందాలు నడపలేదన్నారు. కొంతమంది పింఛనుదారులను తొలగించామని చంద్రబాబు ఆరోపణలు చేయడం అసంబద్ధమన్నారు. టీడీపీ నేతల మాటలను ప్రజలు నమ్మడంలేదన్నారు. పింఛన్ లబ్ది దారుల సంఖ్యను తగ్గించామని ఆ పార్టీ నేతలు ఆరోపించడాన్ని మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు.

Related posts