telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు మహిళ ..!!

ఏపీలోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అనే మహిళ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్‌ అమెరికన్‌ సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం. రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలు కూడా రికార్డు సృష్టించనుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది.

ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష​ కూడా చోటు సంపాదించుకోవడం విశేషంగా నిలిచింది. రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి హాబ్‌నాబ్ చేయటం! గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలు దేరుతుందని కంపెనీ ప్రకటించింది.

Related posts