telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

గురుకులాలలో.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ..

another notification in ap for anm

ఏపీలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సుమారు 750 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భారీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి భారీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సదరు పోస్తులని ఏపీ “సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్” ఇన్‌స్టిట్యూషన్స్ భర్తీ చేయనుంది…ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేయని అభ్యర్ధులు 28-02-2019 ఆఖరు తీదీగా గుర్తించగలరు.

పోస్టుల వివరాలు..:
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ (డీసీఓ): 4
ప్రిన్సిపాల్ (గ్రేడ్ 2) : 27
టీజీటీ : 552 (మొదటి జోన్-79, రెండో జోన్-159, మూడో జోన్-163, నాలుగో జోన్-151).
కేర్‌టేకర్ (వార్డెన్) : 167 (మొదటి జోన్-32, రెండో జోన్-41, మూడో జోన్-41, నాలుగో జోన్-53).
అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, బీఎడ్, టెట్ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి. ఇతర అర్హతలు, పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు : జనవరి 1, 2019 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక : ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తుకు చివరితేదీ : ఫిబ్రవరి 28, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://welfarerecruitments.apcfss.in

Related posts