telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెప్టెంబర్ 1న “సీ యూ సూన్” ఓటిటి రిలీజ్

CU-Soon

పాపులర్ మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ లాక్‌డౌన్ టైంలో సినిమా తీసి విడుదల చేయబోతున్నాడు. ఆ సినిమాను ఐ ఫోన్లో షూట్ చేయడం విశేషం. మహేష్ నారయణన్ దర్శకత్వంలో ఫాహద్ అతని భార్య, హీరోయిన్ నజ్రియా నజీమ్ కలిసి నిర్మించిన సినిమా.. ‘సీ యూ సూన్’(C U Soon).. ఫాహద్, రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటవల ట్రైలర్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. సెప్టెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ ద్వారా ‘సీ యూ సూన్’ విడుదల కానుంది. కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా ఇండియన్ ఫిలిం హిస్టరీలో సరికొత్త చిత్రమని, ప్రజలు ఎప్పుడూ వర్చువల్‌గా కలిసే ఉంటున్నారనే దాన్ని కథాంశంగా తీసుకున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు.

Related posts