telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇది జర్నలిజమా… సుశాంత్ సోదరుడిలాంటివాడు… : కుశాల్‌ టాండన్

Kushal

బాలీవుడ్ హీరో సుశాంత్‌ది అసలు ఆత్మహత్యా? లేదా హత్యా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సుశాంత్‌ తండ్రి బిహార్‌లో ఫిర్యాదు చేసిన కేసు ఆధారంగా రియా, ఆమె కుటుంబాన్ని సీబీఐ విచారిస్తోంది. రియా చక్రవర్తి తండ్రి, సోదరుడిని అధికారులు ప్రశ్నించగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానీని కూడా ఏడు రోజుల పాటు ప్రశ్నించారు. కాగా సుశాంత్ మృతి కేసును విచారిస్తున్న సీబీఐ హీరో గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తికి స‌మ‌న్లు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రియా చేరుకున్నారు. రియాతోపాటు సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానీని మరోసారి ప్రశ్నించనున్నాను. కాగా నటి అంకిత లోఖండే, దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌ సందర్భంగా ప్రారంభమైన వీరి బంధం ఆ తర్వాత విబేధాలు రావడంతో ముగిసిపోయింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా వెబ్‌సైట్‌ సుశాంత్‌తో విడిపోయిన తర్వాత అంకిత, కుశాల్‌ టాండన్‌ అనే నటుడితో కొన్నాళ్లు డేటింగ్‌ చేసిందంటూ కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్తా హాట్‌ టాపిక్‌గా మారడంతో కుశాల్‌ టాండన్‌ దీనిపై స్పందించారు. సదరు వెబ్‌సైట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్‌ తనకు అన్నలాంటి వాడని.. అంకిత మంచి స్నేహితురాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్‌ ట్వీట్‌ చేశారు. ‘నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇది జర్నలిజమా.. నేను.. సుశాంత్‌, అంకితలకు మంచి స్నేహితుడిని. తను‌ నాకు సోదరుడిలాంటివాడు. అంకిత నాకు మంచి స్నేహితురాలు. దయచేసి మీ బ్లేమ్ ‌గేమ్‌లో నన్ను చేర్చకండి. ఇలాంటి వార్తా ప్రపంచంలో ఉన్నందుకు షాక్‌ అవుతున్నాను’ అంటూ కుశాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే సుశాంత్‌ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలపై కూడా స్పందించారు. సుశాంత్‌ మృతిని సర్కస్‌లా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుశాల్‌ టాండన్‌. ‘ప్రపంచమా.. దయచేసి తన ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వు. ఇక్కడ జరుగుతున్న సర్కస్‌ని చూసి స్వర్గంలో ఉన్న ఆ వజ్రం గట్టిగా నవ్వుతుంది. సుశీ. ఎప్పటిలానే వీటన్నింటిని లైట్‌ తీసుకో. చిల్‌ అవ్వు’ అంటూ మరో ట్వీట్‌ చేశారు కుశాల్‌ టాండన్‌.

Related posts