telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆచార్య‌’లో కాజల్‌ని తొలగించిన‌ కొరటాల శివ‌..అందుకేనా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా జ‌రుపుతుంది.

ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ ట్రైల‌ర్‌లో పూజాహెగ్డేను చూపించినప్పటికీ.. కాజల్ కాజ‌ల్ ఒక్క ఫ్రేమ్‌లో కూడా క‌నిపించ‌లేదు. అంతేకాకుండా లేటెస్ట్‌గా జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా కాజ‌ల్ గురించి ఒక్క‌రు మాట్లాడ‌లేదు. దాంతో గ‌త రెండు రోజుల నుంచి ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

అయితే తాజాగా దర్శకుడు కొర‌టాల శివ వీటిపై స్పందించాడు. ఆచార్య నుంచి కాజల్‌ని తొలగించినట్లు సృష్టం చేశాడు”మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్‌ ఉంటే బాగుంటుందనిపించింది. ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. నాలుగు రోజులు షూట్‌ చేశాం. పాత్ర రాసుకున్నాం, షూట్‌ చేశాం కానీ, ‘ఆచార్య’ పాత్రకు లవ్‌ ఇంట్రస్ట్‌ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై నాకు సందేహం కలిగింది. అదే సమయంలో కరోనా రావడంతో కొన్నిరోజులపాటు ఆలోచించాను.

నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగోదని, సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్‌తో చేయిస్తే బాగోదనిపించింది. అలాగే ఆ పాత్రకు పాటలు కూడా లేవు, సరైన ముగింపు కూడా లేదు.. ఇవన్నీ ఆలోచించి ఓసారి చిరంజీవితో ఇదే విషయాన్ని చెప్పాను. ‘కథకు ఏది అవసరమో అదే చెయ్‌. నీకున్న సందేహాన్ని అందరితో పంచుకో’ అని చిరు చెప్పారు. అదే విషయాన్ని కాజల్‌కి అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్థం చేసుకుని..అందంగా నవ్వి.. అంద‌రినీ మిస్ అవుతున్నాను. త‌ప్ప‌కుండా ఫ్యూచ‌ర్‌లో క‌లిసి సినిమా చేద్దామ‌ని అన్నారు.

Koratala Siva: Kajal Aggarwal walked out of 'Acharya' on her own | Telugu Movie News - Times of India

అలా కాజల్‌ పాత్రను తొలగించాం’ అని కొరటాల చెప్పుకొచ్చారు .అయితే, ‘లాహే లాహే’ సాంగ్‌లో కాజల్‌ కనిపిస్తారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని శివ అన్నారు.

ఇక ఈ చిత్రంలో పూజాహెగ్డే మాత్ర‌మే హీరోయిన్‌గా న‌టించిన‌ట్లు క్లారిటీ వ‌చ్చింది. మ్యాట్నీ ఎంట‌ర్టైన‌మెంట్స్ సంస్థ‌తో కలిసి రామ్‌చ‌ర‌ణ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Related posts