telugu navyamedia
సినిమా వార్తలు

భారతీయ సినిమా చరిత్రలో అపురూప దర్శకుడు ఆసిఫ్ ..

కె ఆసిఫ్ , ఈ పేరు తెలియని భారతీయ సినిమా ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మొఘల్ ఈ అజమ్ సినిమా దర్శకుడు ఆసిఫ్. ఈ సినిమా విడుదలై 62 సంవత్సరాలు అవుతుంది . ఇప్పటికీ ఈ సినిమా ప్రభావం ప్రేక్షకులపై వుంది.

మొఘల్ ఈ అజమ్ సినిమా నిర్మాణం 12 సంవత్సరాలు పట్టింది . ఆసిఫ్ ఎన్నో కష్టాలు, కడగండ్ల పాలయ్యాడు . అయినా మొఘల్ ఈ అజమ్ సినిమాను పూర్తి చేసి 1960న విడుదల చేశాడు. మొఘల్ ఈ అజమ్, భారతీయ సినిమాలో ఓ సంచలనం, ఓ చరిత్ర .

మొఘల్ ఈ అజమ్ సృష్టికర్త కె ఆసిఫ్ శత జయంతి సందర్భంగా ఆసిఫ్ జీవితం గురించి తెలుసుకుందాం..

ఆసిఫ్ 1922 జూన్ 14న ఉత్తర్ ప్రదేశ్ లోని ఇట్వా లో జన్మించాడు . ఆయన తండ్రి డాక్టర్ ఫాజిల్ కరీమ్ . తల్లి బీబీ గులాం ఫాతిమా . ఆసిఫ్ కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే అభిమానం . సినిమా రంగంలో పనిచేయాలనే ఉద్దేశ్యంతో బొంబాయి వెళ్ళాడు . ఆసిఫ్ కరీమ్ పేరును కె . ఆసిఫ్ గా మార్చుకున్నాడు .

Mughal-e-Azam: royally glossing over history's true colours | Drama films | The Guardian

దర్శకత్వ శాఖలో పనిచేసి అనుభవం సంపాదించాడు . 1945లో ఫూల్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఈ సినిమా విజయవంతమైంది . ఆ తరువాత అతను అనార్కలి అనే ఉర్దు నవల చదివాడు . అది మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థాన నర్తకి అనార్కలి ప్రేమ కథ . అక్బర్ కుమారుడు సలీం అనార్కలి ని ;చూసి ప్రేమిస్తాడు . వీరి ప్రేమను అక్బర్ ఆమోదించడు .

K Asif Mughal-e-azam Director Birthday Special Story And His Struggle - 'मुगल-ए-आजम' को बनाने में के. आसिफ ने लगाए थे 14 साल, 105 गानों को कर दिया था रिजेक्ट - Entertainment News:

ఈ కథతో అప్పటికే రెండు మూడు సినిమాలు వచ్చాయి . అయినా ఈ కథను ఆసిఫ్ కొత్తగా చెప్పాలనుకున్నాడు .1946లో మొఘల్ ఈ అజమ్ ప్రారంభించడానికి ముందు సలీం పాత్రకు చంద్ర మోహన్, అనార్కలి పాత్రకు నర్గీస్ ను ఎంపిక చేసుకున్నాడు. అయితే షూటింగ్ మొదలు పెడదాం అనుకునే సమయంలో సలీమ్ పాత్రధారి చంద్ర మోహన్ చనిపోయాడు .

Mughal-e- Azam celebrates 61 years. Here's relooking at the classic!
ఆ సినిమా నిర్మాణం అయిపోయింది . .ఆ తరువాత 1951లో “హల్ చల్ ” అన్న చిత్రాన్ని నిర్మించాడు .ఈ సినిమా విడుదల చేసిన తరువాత మళ్ళీ మొఘల్ ఈ అజమ్ పై దృష్టి పెట్టాడు.ఈసారి సలీం పాత్రకు దిలీప్ కుమార్ ను , అనార్కలి పాత్రకు మధుబాలను , అక్బర్ పాత్రకు పృథ్విరాజ్ కపూర్ ను ఎంపిక చేసుకున్నాడు .

Twitter 上的 SanjeevKumarAdmirers:"Remembering K. ASIF on his birthday! #SanjeevKumar @BombayBasanti @FilmHistoryPic @Bollywoodirect @VintageMuVyz @NFAIOfficial @ZeeClassic @MIB_India @Bollyhungama @dastaan_memoirs @FilmiGaane @DDNational #KAsif ...

ఈ సినిమా ఏ ముహూర్తంలో మొదలు పెట్టాడో అన్నీ అవాంతరాలు , అడ్డంకులే … అయినా పట్టువదలని విక్రమార్కునిలా సినిమాను పూర్తి చేసి 12 సంవత్సరాల తరువాత విడుదల చేశాడు. భారతీయ సినిమా రంగంలో ఆణిముత్యం లా మిగిలి పోయింది . దర్శకుడుగా ఆసిఫ్ పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది .

K Asif Mughal-e-azam Director Birthday Special Story And His Struggle - 'मुगल-ए-आजम' को बनाने में के. आसिफ ने लगाए थे 14 साल, 105 गानों को कर दिया था रिजेक्ट - Entertainment News:

ఆసిఫ్ తన జీవితంలో నాలుగు చిత్రాలకే దర్శకత్వం వహించాడు . అందులో ఫూల్ , మొఘల్ ఈ అజమ్ విడుదల కాగా సప్తా ఖూన్ మెహంగా పానీ, లవ్ అండ్ గాడ్ సినిమాలు అసంపూర్తిగా మిగిలి పోయాయి .

K Asif Mughal E Azam Director Lesser Known Facts On His Birth Anniversary - के आसिफ की लगन से बनी थी 'मुगल-ए-आजम', शूटिंग में इस्तेमाल हुए थे असली मोती - Entertainment News:

ఆసిఫ్ కు నలుగురు భార్యలు .. మొదటి భార్యను పెద్దల అంగీకారంతో చేసుకున్నాడు . వీరిద్దరికి ఆరుగురు సంతానం . రెండవ భార్య సితార దేవి. ఈమె గాయని , నటి సితార అసిఫ్ సోదరి సికిందర్ బేగం సవతి, నజీర్ అహ్మద్ ఖాన్ రెండవ భార్య ..అయితే నజీర్, సితార వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు .

ఆ తరువాత ఆమెపై మోజుతో అసిఫ్ సితార ను వివాహం చేసుకున్నాడు . అయితే ఈ ఇద్దరు అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. మూడవ భార్య నిగార్ సుల్తానా అప్పటికే నటి . ఆమెతో ఆసిఫ్ ప్రేమలో పడ్డాడు . నిగార్ సుల్తానా మొఘల్ ఏ అజమ్ సినిమాలో బహార్ గా నటించింది . ఈమె హైద్రాబాద్ కు చెందిన మహిళ. వీరికి ఒక కుమార్తె. ఆమె నటి హీనా కౌసిర్ . నాల్గవ భార్య అక్తర్ . దిలీప్ కుమార్ చిన్న చెల్లెలు .
ఆసీఫ్ మొఘల్ ఈ అజమ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తరచుగా దిలీప్ కుమార్ ను కలవడానికి వెళ్ళేవాడు . అక్కడ అక్తర్ ను చూసి ప్రేమించాడు . దిలీప్ కాదన్నా ఆమెను వివాహం చేసుకున్నాడు .

Mughal-E-Azam review | GamesRadar+

లవ్ అండ్ గాడ్ సినిమా నిర్మాణంలో ఉండగా ఆసిఫ్ మార్చి 9, 1971లో మరణించాడు. ఆ తరువాత అక్తర్ అనేక కష్టాలతో లవ్ అండ్ గాడ్ చిత్రాన్ని పూర్తి చేసి 1986లో విడుదల చేసింది .

Maid keeps K Asif's wife high on pills, steals cash | Hindi Movie News - Times of India

ఆసిఫ్ శత జయంతి . ఈ సందర్భగా గొప్ప కళారాధకుడు , అతను మించిన ప్రేమికుడు అయిన ఈ దర్శకుడు మొఘల్ ఈ అజమ్ సినిమాతో తన జన్మను చరితార్థం చేసుకున్నాడు .

– భగీరథ

Related posts