telugu navyamedia
సినిమా వార్తలు

ఘ‌నంగా ప్రారంభమైన చిరు ‘భోళాశంకర్​ షూటింగ్​..

మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళాశంకర్‌. తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ , హీరోయిన్​గా తమన్నా నటించనున్నారు.

Megastar Chiranjeevi: గ్రాండ్‏గా ప్రారంభమైన భోళా శంకర్.. చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు లైవ్.. 

హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.. ఈ కార్యక్రమంలో చిరు అయ్యప్ప మాలలో ప్రత్యేక పూజలు చేశారు.

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, హరీశ్‌ శంకర్‌, బాబీ, గోపీచంద్‌ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఈ వేడుకలో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ముహుర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్‌ కొట్టారు.

Image

ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి సాగర్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image

అలాగే మెగాస్టార్‌.. గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించారు.

Related posts