telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అభిమానుల కోసం .. సైరా ప్రత్యేక షో..

Syeraa

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా. అక్టోబర్ 2న విడుదల కానుంది. దీంతో ఫస్ట్ డే సినిమా చూడాలని అభిమానులు తెగ తొందర పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ తో ఆన్ లైన్ లో అనేక రికార్డులు సృష్టించే దిశగా సైరా సినిమా సరికొత్తగా ముందడుగు వేస్తుంది. ప్రస్తుతం సినిమాకు ఉన్న క్రేజ్ బట్టి చూస్తుంటే ఫస్ట్ డే నా డే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీమియర్ షోల కోసం హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

శామీర్ పెట్, అలియా బాద్ లోని శ్రీ కృష్ణ థియేటర్ లో ప్రీమియర్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అక్టోబర్ రెండున తెల్లవారు జామున మూడు గంటలకు ప్రీమియర్ షోను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మెగా అభిమానులు మొదటిరోజే ప్రీమియర్ షో చూడటానికి తెగ ఎగబడుతున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ నయనతార మరొక పాత్రలో తమన్నా నటించారు. దేశం కోసం తెలుగు ప్రాంతం నుండి మొట్టమొదటిసారిగా పోరాడిన యోధుడు చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వ్యక్తి కథ ఆధారంగా సైరా సినిమా తెరకెక్కించారు.

Related posts