telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్

Bigil

అట్లీ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్, అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో విజయ్ సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 22న విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్‌తో పాటు విజయ్ లుక్స్‌ విడుదల చేశారు చిత్రబృందం. “బిగిల్‌” (విజిల్) అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే, మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

Related posts