telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ సింగర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కంటెస్టెంట్… ఏం చేశాడంటే ?

Neha-Kakkar

బాలీవుడ్ సింగర్‌ నేహా కక్కడ్ కు అభిమాని నుంచి చేదు అనుభవం ఎదురైంది. పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్‌కు దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఈ షోలో జడ్జిగా ప్రముఖ సింగర్ నేహా కక్కడ్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక కంటెస్టెంట్ నేహా కక్కడ్‌కు కిస్‌ చేస్తూ కనిపిస్తున్నాడు. ఒక కంటెస్టెంట్ కొన్ని గిఫ్టులను తీసుకుని స్టేజీ మీదకు వచ్చాడు. అతను అన్ని గిఫ్టులను నేహాకు ఇచ్చాడు. వీటిని అందుకున్న నేహా అతనికి హగ్ ఇచ్చింది. అయితే ఆ కంటెస్టెంట్ వెంటనే ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీంతో నేహా సిగ్గు పడుతూ తన ముఖాన్ని దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక నేహా తెలుగులో నాగార్జున నటించిన ‘కేడీ’లో ‘నీవేనా నీవేనా’ పాటతో పాటు ‘అలా ఎలా’లో ‘థనక్ థనక్’ పాట పాడిన విషయం తెలిసిందే.

Related posts