*’ఆచార్య’ సినిమా ఐదో షోకు వారం రోజుల పాటు అనుమతి
*టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి నక్సలెట్స్‌గా కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆచార్య చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది . తెలంగాణలో ఆచార్య టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈనెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాదు 29 నుంచి మే 5 వరకు వారం రోజుల పాటు రోజుకు ఐదు షోకు అనుమతులు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది.
హృతిక్ డాన్స్ మూవ్మెంట్స్ చూసి బెదిరిపోయాను… వాణి కపూర్