telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఘనంగా గోపీచంద్ తనయుడి బర్త్ డే వేడుకలు… హాజరైన ప్రభాస్, అల్లు అర్జున్

Gopichand

మాచో హీరో గోపిచంద్ ప్రస్తుతం “చాణక్య” అనే స్పై థ్రిల్లర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మ‌రికొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది. ఇక బిను సుబ్రమణ్యం అనే కొత్త ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లోను ఓ సినిమా చేస్తున్నాడు గోపిచంద్. ఈ యంగ్ హీరో 2013 మే నెలలో రేష్మ‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు. ఇక గ‌త ఏడాది వినాయ‌క చ‌వితి రోజున మ‌రో అబ్బాయి పుట్టాడు. అత‌నికి వియాన్ అనే పేరు పెట్టారు. నిన్న వియాన్ మొద‌టి బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్ ఘ‌నంగా జ‌ర‌ప‌గా ఈ వేడుక‌కి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు. వారిద్ద‌రితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. గోపిచంద్ స‌తీమ‌ణి రేష్మ, శ్రీకాంత్ బంధువు అన్న సంగ‌తి తెలిసిందే. బీటెక్ చ‌దివిన రేష్మా త్రీడీ యానిమేష‌న్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ల‌పై ప‌ట్టు సాధించింది. ఇప్పుడు గోపీచంద్ తనయుడి బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Related posts