telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మమ్మల్నిఒరేయ్ అంటే.. మేం ఒసేయ్ అనలేమా?

ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. . విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని బోండా ఉమ ప్రశ్నించారు.వాసిరెడ్డి పద్మ ఘటన జరిగిన మూడు రోజులకు బాధితురాలని పరామర్శించేందుకు వచ్చారని అన్నారు. 

ప్రభుత్వం బాధితురాలి మానానికి రూ.10 లక్షలు వెలకట్టి చేతులు దులుపుకుందన్నారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఛాలెంజ్‌లు చేస్తున్నారని, ఎలా కమిషన్ ముందు హాజరుకారో చూస్తానంటూ ప్రతిష్ఠ దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. వాసిరెడ్డి పద్మ మమ్మల్ని బెదిరిస్తోంది. మమ్మల్ని ఆకురౌడీలు, అరేయ్.. ఒరేయ్ అంటోంది. ఒక బజారు మనిషిలాగా మాట్లాడుతోంది. మేము ఒసేయ్ అని అనలేమా’’ అని అన్నారు. వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబాన్ని రోడ్డుకు లాగారని విమర్శించారు.

నువ్వు మహిళల హక్కుల్ని కాపాడడానికి ఉన్నావా? వైఎస్ఆర్ సీపీ హక్కుల్ని కాపాడడానికి ఉన్నావా? ఏంటి నీ అహంకారం? ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంటికెళ్లి పరామర్శించి ప్రభుత్వంతో ఆర్థిక సాయం ఇప్పించాల్సింది పోయి అహంకారంతో మాట్లాడతావా? ఆ పని మేం చేస్తే చంద్రబాబు వచ్చిన సమయంలో ఆస్పత్రికి వచ్చి రాజకీయం చేసింద‌ని మండిప‌డ్డారు.

Related posts