telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ భయ్యా… నిన్ను వదిలేదే లేదు… : నిఖిల్

nikhil

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం నితిన్ – షాలిని మ్యారేజ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నితిన్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మరో యంగ్ నిఖిల్ ఆసక్తికర ట్వీట్ పెట్టి ఆకట్టుకున్నారు. నవ దంపతుల ఫోటో షేర్ చేస్తూ.. ”నితిన్ భయ్యా.. కొత్త జర్నీ ప్రారంభించిన నీకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీ జోడీ చూడముచ్చటగా ఉంది. జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కాకపోతే నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్! నిన్ను వదిలేదే లేదు.. కరోనా తర్వాత పార్టీ చేసుకుందాం” అని పేర్కొన్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న నిఖిల్ ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.

Related posts