telugu navyamedia
సినిమా వార్తలు

“బాక్సర్”గా మారిన సాహో నటుడు… ఫస్ట్ లుక్ వైరల్

Boxer

ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం “సాహో”లో కీల‌క పాత్ర పోషిస్తున్న నటుడు అరుణ్ విజ‌య్ కొన్నేళ్ళ నుండి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే సాహో షూటింగ్ పూర్తి చేసుకున్న అరుణ్ విజయ్ ప్ర‌స్తుతం త‌న త‌దుపరి సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు “బాక్స‌ర్‌” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో అరుణ్ విజ‌య్ బాక్స‌ర్‌గా కనిపించనున్నారు. వివేక్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. రితికా సింగ్‌, సంజ‌నా గ‌ల్రానీ క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు. ఇటీవ‌ల ఆ సినిమాకు సంబంధించిన వ‌ర్క‌వుట్స్‌ వీడియోని త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూస్తుంటే అరుణ్ త‌న పాత్ర కోసం బాగా హార్డ్ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు అర్ధ‌మ‌యింది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుదలైంది. ఇందులో అరుణ్ విజ‌య్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. అరుణ్ విజయ్ లుక్ చూసిన అభిమానులు ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాయడం ఖాయ‌మ‌ని అంటున్నారు నెటిజ‌న్స్. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts