telugu navyamedia
సినిమా వార్తలు

స్వ‌ర్గంలో ‘బంగార్రాజు’ లీల‌లు ..

అక్కినేని నాగార్జున‌ నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి సీక్వెల్ గా రాబోతున్న చిత్రం ‘బంగార్రాజు’. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు.

ఇందులో నాగచైతన్య, కృతీ శెట్టిలనుమరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బంగార్రాజు’ సినిమాలో ఏయన్నార్‌ని గుర్తు తెచ్చేలా నాగార్జున గెటప్‌ను డిజైన్‌ చేశారు ఈ చిత్రదర్శకుడు కల్యాణ్‌కృష్ణ.

Naga Chaitanya and Nagarjuna begin filming for Bangarraju : Bollywood News - Bollywood Hungama

తాజాగా ఈసినిమా నుంచి లడ్డుందా సాంగ్‌ టీజర్‌ రిలీజైంది.’ బాబూ తబలా, అబ్బాయి హార్మోనీ.. తానన ననన.. డాంటకు డడనా..’ అంటూ ఏదో రాగం అందుకున్నాడు. ఇదర్థం కాక ఓ వ్యక్తి రాజుగారు దీని మీనింగ్‌ ఏంటని అడిగాడు.  న‌వ్వుతూ.. ‘ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? అడగాలి కదా! నేర్పిస్తాను కదా!’ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు.

ఫుల్‌ సాంగ్‌ను నవంబర్‌ 9 ఉదయం 9.09 గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా టీజర్‌ చూస్తుంటే నాగ్‌ స్వర్గంలోని దేవకన్యలతో డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

నవంబర్ 9న విడుదల కాబోతున్న బంగార్రాజు ఫస్ట్ వీడియో సాంగ్ లడ్డుందా...

ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

Related posts