telugu navyamedia
సినిమా వార్తలు

హైదరాబాద్ కు మకాం మారుస్తున్న రేణూదేశాయ్

Renu-Desai

రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా తెలుగు ప్రేక్షకులకు రేణు సుపరిచితురాలే. అయితే పవన్ తో విడిపోయిన తరువాత రేణూదేశాయ్ తన రెండవ పెళ్ళికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ సమయంలో పవన్ అభిమానుల ట్రోలింగ్ కు గట్టిగానే సమాధానం చెప్పింది. ఇక తనను తాను దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతోంది. ఇన్ని రోజులు ఈమె పూణేలో ఉంది. అక్కడ్నుంచి హైదరాబాద్ కు వస్తూ వెళ్తుంది. తన పని ఉన్నా కూడా పూణే నుంచి రోజూ వచ్చి వెళ్తుండటం ఇబ్బందిగా మారడంతో ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది రేణు. ఈ మధ్యే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో త్వరలో తాను హైదరాబాద్‌కు మకాం మార్చేస్తున్నట్లు చెప్పింది రేణు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన నుంచి దూరంగా ఎక్కడో పూణేలోనే ఉంది రేణు దేశాయ్. అయితే ఇప్పుడు తాను హైదరాబాద్ రావడానికి కారణం మాత్రం సినిమా అని చెబుతుంది ఈమె. త్వరలోనే తాను రైతుల సమస్యలతో సినిమా చేయబోతున్నానని, నిర్మాతలతో చర్చల కారణంగా తాను హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయంటుంది ఈమె. తరుచూ పని మీద పూణే టూ హైదరాబాద్ ఇబ్బందిగా ఉందని చెప్పిన రేణు.. హైదరాబాద్ మకాం మార్చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Related posts