telugu navyamedia
సినిమా వార్తలు

నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉన్నా..

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా కనిపించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు.

Rana, Sai Pallavi's 'Virata Parvam' will get a theatrical launch date - The Times Of Truth
ఈ సినిమా జూన్ 17న సినిమాను రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌ స్పీడు పెంచింది.. ముందుగా ఈ సినిమా నుంచి ‘నగాదారిలో’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. రానా రాసిన బుక్ చదివి ఇన్ఫ్లుయెన్స్ అయిన సాయిపల్లవి అతడిని ఎలాగైనా కలవాలనుకుంటుంది.

Sai Pallavi-Rana Daggubati starrer 'Virata Parvam' gets release date | The News Minute

చిన్న ఎవడు? పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు? సామ్యవాద పాలననే స్థాపించగ ఎదిగినాడు..’ అంటూ రానా మాటలు వినిపించడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. అతడు రాసే పుస్తకాలను చదివి ఇన్ఫ్లుయెన్స్ అయిన సాయిపల్లవి హీరోతో తెలియకుండానే ప్రేమలో పడుతుంది .

పుస్తకం రాశినోడును చూడాలనుందంటూ అమ్మవారి దగ్గర మొద పెట్టుకుంటుంది హీరోయిన్‌. అలా అడిగిందో రవన్న దళం ఊర్లో దిగుతుంది. అందులో లీడర్‌ రానాను చూసి మురిసిపోయింది సాయి. అంతేకాదు, ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తిని పొందడం కోసం తాను కూడా నక్సలైట్‌గా మారుతుంది.

The Voice Of Ravanna from Virata Parvam: Rana Daggubati and Sai Pallavi's intense chemistry takes the cake | PINKVILLA

ట్రైలర్ లో సన్నివేశాలన్నీ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. రానాకి ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్.

నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉన్నా’, ‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది’ అన్న సాయి పల్లవి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.

ఇక నక్సలైట్ల వల్ల ఏమన్న ఉపయోగం ఉందా? అని ఓ పోలీసు అడగ్గా.. ‘మా ఊర్ల ఆడోళ్ల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ రాలేదు, మా అన్నలు వచ్చిర్రు’ అని నక్సలైట్ల మంచితనాన్ని గురించి చెప్పాడు రాహుల్‌ రామకృష్ణ.

Sai Pallavi and Rana Daggubati team up for Virata Parvam 1992- Cinema  express

అలానే రానాతో కలిసి తుపాకీ పట్టుకొని సాయిపల్లవి షూట్ చేసే సన్నివేశాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. సినిమాలో సాయిపల్లవి వెన్నెల అనే క్యారెక్టర్ లో కనిపించనుంది. దర్శకుడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ చెప్పినట్లుగా ఉన్నారు.

నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Related posts