telugu navyamedia
సినిమా వార్తలు

హైదరాబాద్‌లో ఘనంగా కంగనా ‘తలైవి’ ప్రీ రిలీజ్ ఈవెంట్

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుంది. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. కాగా హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగిన ‘తలైవీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ జరిగింది. ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, విజ‌యేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అవుతుంది. థాంక్యూ వెరీ మ‌చ్‌. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోందని’ అన్నారు.

అరవింద్ స్వామి మాట్లాడుతూ.. ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాలో భాగం కావడం చాలా అద్భుతమైన అనుభవం. ఈ సినిమాతో మీ అందరి ముందుకు రావడం ఆనందంగా ఉంది. విజయ్ సార్‌తో పాటు చిత్రయూనిట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓ నటుడిగా ఈ సినిమాలో కంగనా లాంటి స్టార్లతో నటించి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాను కంగనా తన భుజాలపై వేసుకొని నటించింది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నానని తెలిపారు.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలకానుంది. ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. అంతేకాదు జయలలిత జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను ‘తలైవి’ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

Related posts