telugu navyamedia
సినిమా వార్తలు

‘భం అఖండ, భం భం అఖండ’ టైటిల్ సాంగ్ విడుద‌ల‌..

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టిస్తున్న‌ చిత్రం ‘అఖండస‌. బాల‌య్య‌కు జ‌త‌గా ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర టైటిల్​ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. ​ ఇంతకు ముందు ‘సింహా’, ‘లెజెండ్​’ చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన బాల‌య్య ..బోయ‌పాటి మ‌రోసారి రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌నున్నారు.

Akhanda Title Song: Balakrishna Roars As Aghora

ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఆఖండ నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది​. అఘోరగా బాలకృష్ణ గెటప్ మీద చిత్రీకరించిన ‘భం అఖండ, భం భం అఖండ’ అనే టైటిల్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ వీడియో వైరల్ గా మారింది.

ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, సిద్ధార్థ్‌ మహదేవన్‌, శివమ్‌ మహదేవన్‌ అద్భు్తంగా ఆలపించారు. తమన్‌ సంగీత సారథ్యం వహించారు. శ్రీకాంత్‌, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

Related posts