పాన్ ఇండియా స్టార్ , డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రాధేశ్యామ్ నుంచి రెండో సాంగ్ రిలీజైంది. సినిమా విడుదలకు చాలానే సమయం ఉన్నప్పటికీ ప్రభాస్ అభిమానులు అసలు ఏమాత్రం ఓపిక పట్టడం లేదు.
ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ టీజర్ అలరిస్తూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. నిన్న ‘ఆషి కీ ఆగయి” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసిన చిత్రబృందం నేడు తెలుగు ప్రేక్షకులతో పాటు మిగతా భాషల అభిమానుల కోసం అన్ని సౌత్ లాంగ్వేజెస్‌లో “నగుమోము తారలే” వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సాంగ్ మొదట్లో “నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా ?” అని పూజా ప్రశ్నించగా, “ఛ నేను ఆ టైప్ కాదు” అని ప్రభాస్ చెప్పడం, “కానీ నేను ఆ టైపే.. నాతో ప్రేమలో పడితే చావు తప్పదు” అని హెచ్చరించడం, “ఐ జస్ట్ వాంట్ ఫ్లర్టేషన్ షిప్” అంటూ ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్, డైలాగ్స్ తో పాటు సిద్ శ్రీరామ్ వాయిస్ మ్యాజిక్ మైమరిపిస్తోంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి.
1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్గా(హస్తరేఖలు చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తి) నటించారు.ఈ చిత్రంలో సీనియర్ నటి భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది.