telugu navyamedia
సినిమా వార్తలు

బాహుబలి-3లో హాలీవుడ్ స్టార్…!

Samuel L Jackson wants to cast in Baahubali-3

హాలీవుడ్ నట దిగ్గజం శామ్యూల్ ఎల్ జాక్సన్ బాహుబలి-3లో నటించాలని ఉందంటూ తన కోరికను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జురాసిక్ పార్క్, ఏ టైమ్ టు కిల్, ది ఎక్సార్సిస్ట్, డై హార్డ్ విత్ ఏ వెంజన్స్, ద ఇంక్రెడిబుల్స్, స్టార్ వార్స్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శామ్యూల్ ఎల్ జాక్సన్. 1994లో వచ్చిన పల్ప్ ఫిక్షన్ అనే చిత్రంలో ఆయన నటనా ప్రతిభకు గానూ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. శామ్యూల్ నటించిన తాజా చిత్రం “అవెంజర్స్ : కెప్టెన్ మార్వెల్” శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శామ్యూల్ “మోస్ట్ లీ సేన్” అనే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలో మీకు ఇండియా వెళ్లే ఆలోచన ఉందా ? ఎప్పుడైనా బాలీవుడ్ గురించి విన్నారా ? బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా ? అనే ప్రశ్నలు ఎదురయ్యారు. ఈ ప్రశ్నకు సమాధానంగా శామ్యూల్ అవకాశం వస్తే, మంచి పాత్రనిస్తే తప్పకుండా బాలీవుడ్ సినిమాలు చేస్తానని, బాహుబలి-3లో నటించాలని ఉందని తన మనసులోని మాటను వెలిబుచ్చారు. మరి ఈ విషయం గురించి రాజమౌళి ఏమంటారో చూడాలి.

Related posts