telugu navyamedia
సినిమా వార్తలు

సరయు ఎలిమినేషన్‌కు కారణమిదే ..

అంతా ఊహించినట్టుగానే బిగ్ బాస్ హౌజ్ లో తొలి ఎలిమినేషన్ లో సరయు బయటకొచ్చేసింది. వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన సరయూ వారం రోజులకే వెనుదిరిగింది. సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ , బోల్డ్ కంటెంట్ తో తక్కువ కాలంలోనే ఫుల్ ఫేమస్ అయిన సరయు కనీసం మూడు నాలుగు వారాలైన బిగ్ బాస్ హౌజ్ లో ఉంటుందనుకున్నారు. బయట అందరినీ గడగడలాడించే ఆమె హౌస్‌లో ఎక్కువరోజులు ఉండలేకపోయింది. ఫస్ట్ వీక్ లోనే నామినేషన్లు పెట్టడంతో గేమ్ లో భాగంగా సరయు బయటకు రాక తప్పలేదు.

sarayu Eliminated From Big Boss and Final Counter To House Mates

తక్కువ ఓట్లు కారణంగానే సరయు హౌస్ నుంచి ఔట్‌

”తక్కువ ఓట్లు వచ్చిన కారణంగానే సరయు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింద‌ని తెలుస్తోంది. ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్‌లు హౌస్ లోపలికి వెళ్లారు. తొలి వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఆర్జే కాజల్, రవి, మానస్, జశ్వంత్, సరయు, హమీదా ఉన్నారు.అయితే సరయుకి తక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున తెలిపారు. తొలి వారంలోనే దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆమెను ముగ్గురు నామినేట్ చేశారని స‌మాచారం.

Youtuber Sarayu to enter Bigg Boss 5 Telugu house as contestant - tollywood

కాగా.. నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్ల నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసిన సరయు హౌజ్ లోంచి బయటకు రాగానే.. లోపల ఉన్న ఒక్కొక్కరికీ గట్టిగా ఇచ్చి పడేసింది. వెళ్లిపోయే ముందు హోస్ట్ నాగార్జునా ఇచ్చిన చివరి టాస్క్ ను సరయు భలే వాడుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ప్రస్తుతం ఉన్న 18 మందిలో ఐదుగురు బెస్ట్ కంటెస్టెంట్స్, ఐదుగురు వరస్ట్ కంటెస్టెంట్స్ గురించి చెప్పమన్నాడు.

అంతే.. దొరికిందే ఛాన్స్ అని సరయు ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చుకుంది. బెస్ట్ కంటెస్టెంట్ల గురించి చెప్తూ కన్నీరు పెట్టుకున్న సరయు.. వరస్ట్ కంటెస్టెంట్ల గురించి చెప్తూ రివెంజ్ తీర్చుకుంది.

Related posts