telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి…

అనిల్ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఎఫ్3. అయితే గత కొంతకాలంగా ఈ ఎఫ్3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో కూడా చేయనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మూడో స్టార్ హీరోగా రవితేజ చేయనున్నాడని, మహేష్, సాయి ధరమ్ తేజ్ ఇలా మరికొందరి పేర్లు కూడా వినిపించాయి. ఈ వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. దాంతో దర్శకుడు అనిల్ రావిపుడి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఆసినిమాతోనే స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత అనిల్ చేస్తున్న సినిమా ఎఫ్3. ఈ సినిమాలో మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు మూడో హీరో అన్న ఆలోచన కూడా తనకు లేదని అనిల్ తేల్చి చెప్పాడు. అంతేకాకుండా ఎఫ్2ను ఇద్దరితోనే ముగించానని అలాగే ఎఫ్3ని కూడా వారితోనే ముగాస్తానని తెలిపాడు. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాస్తున్నాడు. ఎఫ్2ను కూడా దిల్ రాజే నిర్మాంచాడు. ఇందులో కూడా ఎఫ్2 మాదిరిగానే తమన్నా, మెహ్రిన్‌లూ కనిపించనున్నారు. కానీ ఎఫ్3లో వచ్చే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

Related posts