ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో ఉప్పేస్తున సినిమా ఉప్పెన. ఇందులో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించారు. అయితే తమ తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుందీ జంట. ఈ సినిమా బుచ్చిబాబు అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి అలరించింది. ఈ సినిమాలోని ప్రతి అంశం కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తెలుగులో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఉప్పెన సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాను తమిళంలోకి రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. తమిళ రీమేక్ హక్కులను ఇప్పటికే విజయ్ సేతుపతి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్లు…త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. చూడాలి వారి అక్కడ ఈ సినిమా ఎంత మేర విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది.
previous post
next post