శ్రీకాంత్ ప్రధాన పాత్రలో జై రాజా సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం “మార్షల్”. ఈ చిత్ర టీజర్ ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్ డాక్టర్ పాత్రలో కన్పిస్తున్నారు. వైద్యం పేరుతో ఆడవాళ్లను కిడ్నాప్ చేసి స్టెరాయిడ్లు ఎక్కించడం వంటి సన్నివేశాలను చూస్తుంటే ఈ చిత్రం మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని అర్దమవుతుంది. ఈ టీజర్లో “ఈ భూమ్మీద పుట్టి చనిపోయే ప్రతి మనిషి… మొట్టమొదటగా, చిట్టచివరగా చూసేది డాక్టర్‌నే. మానవ శరీరాన్ని సృష్టించేది దేవుడే అయినా అప్పగించేది మాత్రం వైద్యుడే” అన్న డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అభయ్, మేఘా, రష్మి కీలక పాత్రలు పోషించారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post
నా సినీ రంగ ప్రవేశంపై అనుమానాలు : విజయశాంతి