telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బాలాకోట్‌ సందర్శనకు .. వాతావరణం సహకరించట్లేదు.. ! పాక్ ..

Surgical Strike 2Pakistan Indian air space

పాక్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న బాలాకోట్‌ సందర్శనకు వెళ్లిన రాయటర్స్‌ సంస్థ ప్రతినిధులను ఆ దేశ అధికారులు అడ్డుకున్నారు. ఇటీవల భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలకు బాలాకోట్‌ ప్రాంతమే కీలకంగా మారిన విషయం తెలిసిందే. పుల్వామాలో ఉగ్రదాడి జరగడం, ఆ తర్వాత బాలకోట్‌ పట్టణ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణ శిబిరంపై భారత్‌ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.

దీనితో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ప్రాంతంలోని మదర్సాను, ఆ చుట్టుపక్క ప్రాంతాలను సందర్శించేందుకు రాయటర్స్‌ సంస్థ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. కానీ పాకిస్థాన్‌ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. గడచిన తొమ్మిది రోజు వ్యవధిలో పాత్రికేయులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రయత్నించడం ఇది మూడోసారి.

భద్రతాపరమైన సమస్యల కారణంగానే ఈ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదని పాకిస్థాన్‌ అధికారులు స్పష్టం చేశారు. వాతావరణం ప్రతికూంగా ఉండడంతో పాటు ఇతర కారణాల వల్ల పాక్‌ సైనిక విభాగం అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని పాత్రికేయులకు తెలియజేశారు. మరికొద్ది రోజుల పాటు ఆ ప్రాంతాన్ని సందర్శించడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు.

Related posts