telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్”లో ఇంపార్టెంట్ రోల్… క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

Shruthi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్`లో శృతి హాసన్ నటించనుందనే వార్తలపై క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘పింక్’ మూవీకి రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌తో పాటు శృతి హాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన శృతి.. తాను వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. “అవును.. నేను వకీల్‌సాబ్ మూవీ నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే చెప్పలేను” అని తాజాగా ఓ మీడియా ముందు ఓపెన్ అయింది శృతి హాసన్. తాను విలన్ రోల్ పోషించేందుకైనా సిద్దమే అని, తనకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవని ఈ సందర్భంగా శృతి పేర్కొంది. అలాగే తన ఇంట్రెస్ట్ విషయమై రియాక్ట్ అవుతూ.. తాను పూర్తిగా సంగీతంపై దృష్టి పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం నటన గురించే ఆలోచిస్తున్నానని తెలిపింది.

Related posts