telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ సామాజిక

ఉత్తరాంధ్రకు .. తుఫాను హెచ్చరికలు.. అల్లకల్లోలంగా సముద్రం…

RTGS warning to AP state on cyclone

ఆర్టీజీఎస్ మరోసారి ఉత్తరాంధ్ర జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల వల్ల జులై 6, 7న ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని.. గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని.. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలని హెచ్చరించారు.

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. అలాగే సముద్ర అలల తీవ్రత ఎక్కువగా ఉండే తీరప్రాంత మండలాల జాబితాను విడుదల చేసింది.

విశాఖపట్నం జిల్లా లో ప్రభావితం అయ్యే ప్రాంతాలు : గాజువాక, భీమునిపట్నం, పెద గంట్యాడ, పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి, విశాఖపట్నం (అర్బన్), విశాఖపట్నం (రూరల్)

శ్రీకాకుళం జిల్లా లో ప్రభావితం అయ్యే ప్రాంతాలు : ఇచ్చాపురం, ఎచ్చెర్ల, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పొలాకి, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, రణస్థలం

విజయనగరం జిల్లా లో ప్రభావితం అయ్యే ప్రాంతాలు : పూసపాటిరేగ, బోగాపురం

Related posts