telugu navyamedia
సినిమా వార్తలు

కేసీఆర్ బయోపిక్ నుంచి వివాదాస్పద పాట

RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవ‌ల “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వ‌ర్మ ప్ర‌స్తుతం రెండు బ‌యోపిక్‌ల‌ని రూపొందించే ప‌నిలో ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై “టైగర్ కేసీఆర్” అనే టైటిల్‌తో ఓ బయోపిక్ చేస్తుండ‌గా, “శశికళ” పేరుతో కూడా బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు . అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించారు అన్న నేప‌థ్యంలో వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న “టైగ‌ర్ కేసీఆర్” చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల టైటిల్ లోగో విడుద‌ల చేశారు. టైటిల్‌కి “అగ్రెసివ్ గాంధీ” అనే క్యాప్షన్ తో పాటు “ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు” అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ పాట లిరిక్స్ ఇప్పుడు తీవ్ర వివాదం రేపేలా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన లిరిక్స్ ను హమ్ చేస్తూ వీడియో విడుదల చేశారు. “మా భాష మీద నవ్వినవ్… మా ముఖాల మీద ఊసినవ్… మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా… వస్తున్నా… వస్తున్నా… మీ తాటతీయనీకి వస్తున్నా…” అంటూ తాను ప్రకటించిన “టైగర్ కేసీఆర్” లోని ఓ సాంగ్ లిరిక్స్ ను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడుతూ వీడియో తీసి యూ ట్యూబ్ లో విడుదల చేశారు. “టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్” అని కూడా ఆయన అన్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఇది ఆంధ్రులనందరినీ అవమానించేలా ఉందని, ఈ పాటను అంగీకరించేది లేదని కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లపై స్పందించిన వర్మ “నా సినిమా ఆంధ్రాను విలన్ గా చూపించడం కాదు… ఇది కొంతమంది ఆంధ్రోళ్లు… ఎవరైతే తెలంగాణ విభజన సమయంల సమస్యలు సృష్టించిన, వెన్నుపోటు పొడిచిన వాళ్లపై మాత్రమే” అంటూ ట్వీట్ చేశారు.

Related posts