ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కరోనా కంటే ముందే మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. చకచకా ఈ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తో ఎప్పుడెప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జనవరి 10, ఉదయం 10:08 గం.లకు ‘లవ్ స్టోరీ’ టీజర్ రాబోతుంది. ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ పోస్టర్ ను వదిలింది టీమ్. ఈ పోస్టర్ లో నాగచైతన్య, సాయి పల్లవి చూడ ముచ్చటగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఇటీవలే ఈ సినిమా నుంచి సాయిపల్లవి, నాగచైతన్య పెళ్లి పీటలపై ఉన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
previous post
next post