జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, ఆయనను ఏమని పిలవాలో తనకు అర్థం కావట్లేదని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారని అన్నారు. ఎవరి దమ్ము ఎంతో రాష్ట్ర ప్రజలకు తెలుసని, మొన్నటి ఎన్నికల్లో పవన్ ను రెండు చోట్ల ఓడించినా ఆయనలో మార్పులేదని చెప్పారు.
సీఎం జగన్ సంక్షేమపాలన చూసి చంద్రబాబు, పవన్ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. కులాలు, మతాల గురించి ఎప్పుడూ సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసేది పవన్ కల్యాణే అని ఆరోపించారు. 2017లో కర్నూలులో యువతి హత్య ఘటన జరిగింది చంద్రబాబుపాలనలో అని, అప్పుడు పవన్ నిద్రపోయారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ముందు పేపర్ చదవడం నేర్చుకోవాలని సూచించారు.
జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నారాయణ