“ఆర్ఎక్స్ 100” సినిమా తరువాత పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో భారీ క్రేజ్ వచ్చింది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నప్పటికీ మంచి ప్రాధాన్యమున్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తెలుగులో పాయల్ వెంకటేష్ సరసన “వెంకీ మామ”, నాగార్జునకు జోడిగా “మన్మథుడు-2″లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. మరోవైపు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ అగ్రహీరోలకు జతగా అవకాశం దక్కించుకున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో నెటిజన్లకు నిద్ర కరువయ్యేలా చేస్తోంది. తాజాగా తాను వేసుకున్న టాప్ తీసేస్తున్నట్టుగా సెకన్ల వ్యవధిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో గంటల్లోనే వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియోను ఓసారి చూసేయండి.