telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరో రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే … రోజుకి 7కోట్లు

Salman-KHan

సల్మాన్ చేత యాడ్స్ చేయించుకోవడానికి పెద్ద పెద్ద బ్రాండ్లు ఎగబడుతుంటాయి. ఓ చైనీస్ స్మార్ట్ఫోన్‌ బ్రాండ్‌కి సల్మాన్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు కాంట్రాక్ట్‌పై సంతకం చేసారు. అయితే ఇందుకోసం సల్మాన్ ఓ ప్రకటనలో నటించాల్సి ఉంది. ఈ యాడ్ షూట్ చేయడానికి కనీసం ఓ వారం రోజులైనా పడుతుంది. ఎందుకంటే సల్లూ భాయ్ కాల్‌షీట్స్ దొరకడం అంత సులువు కాదు. ఇకపోతే ఈ ప్రకటనలో నటించేందుకు సల్మాన్ రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా? రోజుకి అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు. ఇప్పటివరకు ఇండియాకు చెందిన ఏ స్టార్ హీరో కూడా ఇంత స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదట. దాంతో ఈ టాపిక్‌ కాస్తా బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్‌లో ఈ యాడ్ షూట్ జరుగుతుంది. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts