telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచి పనిచేస్తే ఇలాంటి విమర్శలు తప్పవు… : సోనూసూద్

sonu-sood

లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా.. సోనూపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై తాజాగా సోనూ స్పందించాడు. “నా గురించి వచ్చిన ప్రశంసలను, ఆరోపణలను ఇప్పటివరకు పట్టించుకోలేదు. వలస కార్మికులకు సహాయం చేసే పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను. అందువల్ల వాటి గురించి పట్టించుకునే తీరిక లేదు. అయినా, ఏదైనా మంచి పనిచేస్తే ఇలాంటి విమర్శలు తప్పవు. మంచి పనులు చేస్తున్నవారిని కొందరు కావాలనే వేలెత్తి చూపిస్తారు. వాటిని పట్టించుకోకుండా మనం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోవాలి” అని సోనూ సూద్ అన్నాడు.

Related posts