telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

169 వ సినిమాకు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్

Rajinikanth

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యంగ్ హీరోలు సైతం షాకయ్యేలా వరుస సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు రాజ‌కీయాల‌లో ఎంట్రీ ఇస్తారని భావిస్తుంటే… ఆయన మాత్రం త‌న సినిమాల‌కి బ్రేక్ వేయ‌డం లేదు. తాజాగా ర‌జ‌నీకాంత్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో “ద‌ర్భార్” సినిమా చేశారు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి కొద్ది రోజుల‌లో శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 168వ సినిమాని చేయ‌నున్నాడు ర‌జ‌నీకాంత్‌. డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ర‌జ‌నీకాంత్ 169వ చిత్రంకి సంబంధించి తాజాగా ఓ వార్త కోలీవుడ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. ఆయ‌న టేకింగ్ స్టైల్‌తో పాటు క‌థ కూడా ర‌జ‌నీకి న‌చ్చ‌డంతో వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కావ‌ల‌సి ఉంది. ఇదిలా ఉంటే గౌత‌మ్ మీన‌న్.. ప్ర‌ముఖ ర‌చ‌యిత గోవింద్ నిహ్లాని రాసిన న‌వ‌ల ఆధారంగా చిత్రం తెర‌కెక్కించ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఇందులో ఏది నిజ‌మో తెలియాల్సి ఉంది.

Related posts