తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది సాయి పల్లవి. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. సాయి పల్లవి. ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది అనేది సమాచారం. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. అది అలా ఉంటే తాజాగా సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ తనకు సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒక వేళా నటి కాకుంటే ఏం చేసుండే వారని అడగగా ఎంబీబీఎస్ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని తెలిపింది. ఎవరికి తెలియని విషయం చెప్పండని అడగగా… మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదని సమాదానం ఇచ్చింది. ఇక ఎప్పుడైన ఏడ్చారా.. అని ప్రశ్నించగా..ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదే పదే రీషూట్ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఒకరోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను అని చెప్పింది.
previous post
next post