telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియురాలి దగ్గరికి పంపించాలంటూ సోనూసూద్ ను కోరిన నెటిజన్… ఆయన రియాక్షన్ ఇదీ…!!

sonu-sood

లాక్ డౌన్ వేళ సినీనటుడు సోనూసూద్ వలస కార్మికుల కోసం ఆరాటపడుతూ తన వంతు సాయం చేస్తున్నాడు. కాగా దేశంలో లాక్ డౌన్ లో సడలింపులు చేయడంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని ప్రభుత్వం సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతిచ్చింది. దాంతో సోనూసూద్ తన సొంత డబ్బులతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి మరీ కార్మికులను సొంత ఊర్లకు చేర్చాడు. సోనూసూద్ వలస కార్మికుల కోసం పడుతున్న కష్టం చూసి ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైతం అతడి సేవలను కొనియాడింది. తాజాగా సోనూసూద్ ను ఓ నెటిజన్ ఫన్నీ కోరిక కోరాడు. బీహార్‌లో ఉన్న తన ప్రియురాలి దగ్గరికి తనను పంపించాలంటూ కోరాడు. అది చూసిన సోనూ స‍్పందిస్తూ.. ‘భయ్యా.. కొన్ని రోజులు నీ ప్రేమకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష’ అంటూ తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.

Related posts