telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

అజ్ఞాతంలో.. గంటా.. మరో పార్టీవైపు చూపులు.. !

AP DSC Merit list released Minister Ganta

టీడీపీలో టిక్కెట్ల హడావుడితోనే సగం మంది వేరే పార్టీలలో చేరుతున్నారు. ఖచ్చితంగా విజయం సాధించాల్సిన సందర్భం రావటంతో, చేసేది లేక అధిష్టానం కూడా మరో ఆలోచన లేకుండా, బలమైన అభ్యర్థులు ఎవరైనా వారికే సీట్లు కేటాయిస్తుంది. తద్వారా పార్టీ కోసం కష్టపడినా వారికి మనస్తాపం తప్పడంలేదు. దీనితో ప్రధానమైన వారుగా ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీ మారె మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ జాబితాలో ఇంతకుముందే అడుగు వేయబోయి మళ్ళీ చంద్రబాబు చొరవతో ఉండిపోయిన గంటాకు మరోసారి అదే సందర్భం వచ్చింది. తన సీటుకు ఎసరు పేటి లోకేష్ కు ఆ స్తానం ఇవ్వాలని బాబు నిర్ణయించడంతో మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు గంటా.

ఈసారి గంటాను బాబు ఎమ్మెల్యేగా కాకుండా, ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో, అది ఇష్టంలేని మంత్రి గంటా శ్రీనివాసరావు, నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాను అమరావతికి వెళుతున్నానని చెప్పిన ఆయన, హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి స్థానం నుంచి లోకేశ్ పోటీ చేస్తారని లేదా టీడీపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరితే, ఆయనకు ఆ స్థానం కేటాయిస్తారనే నెపంతో మొత్తానికి గంటా సీటు పోనుంది. ఈ సారి గంటా ఖచ్చితంగా పార్టీ మారె నిర్ణయం తీసుకుంటే, బాబు మాటలు కూడా వినబోడని, అంతలా ఆయన అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తుంది. ఇక ఆయన తదుపరి కార్యాచరణ తెలియాల్సి ఉంది.

Related posts