telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కారు వారి పాట” నుంచి సాంగ్… మహేష్ బర్త్ డే సర్ప్రైజ్ గా…!

SVP

సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అతిత్వరలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ తాలూకు వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, అనన్య పాండేల పేర్లు విన్పిస్తున్నాయి. కాగా ‘సర్కారు వారి పాట’ చిత్ర నిర్మాతలు కూడా తమ హీరో మహేశ్ బాబు జన్మదినం రోజున ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ నెల 9న మహేశ్ జన్మదినం. ఈ సందర్భంగా ‘సర్కారు వారి పాట’ చిత్రం నిర్మాతలు ఈ సినిమా నుంచి టైటిల్ సాంగును వదలనున్నట్టు తెలుస్తోంది. అభిమానులను ఈ పాట బాగా అలరిస్తుందని భావిస్తున్నారు.

Related posts