telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రజలకు జరిమానా సరే… మరి ప్రభుత్వానికి ఎంత జరిమానా ?… ముఖ్యమంత్రికి హీరోయిన్ ప్రశ్న

Yadyurappa

సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి మోటారు వాహనాల చట్టం-2019 అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఒక వ్య‌క్తికి 16 వేలు, మ‌రో వ్య‌క్తికి 23 వేలు జ‌రిమానా విధించిన‌ట్టు వార్త‌ల‌లో వచ్చిన విష‌యం తెలిసిందే. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీతో పాటు ఇతర ఆధారాలు వెంట తెచ్చుకోవాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్‌ను క‌ఠిన‌త‌రం చేశారు. ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్స్‌, డ్రైవింగ్ లైసెన్సులు లేక‌పోతే ప్ర‌జ‌లకు భారీ జ‌రిమానాలు విధిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరు ముఖ్య‌మంత్రి యాడ్యూరప్ప ను హీరోయిన్ సోనూగౌడ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల సంపాద‌న‌ను జ‌రిమానాల రూపంలో వ‌సూలు చేయ‌డం కాదు.. ప్ర‌జ‌లు ప్ర‌యాణించేందుకు సరైన రోడ్లు కూడా వేయాల‌ని సూచించారు. త‌న ట్విట్ట‌ర్‌లో వాహ‌న‌దారుడు ప‌డుతున్న ఫోటోను జ‌త చేసిన సోనూగౌడ‌, వాహ‌న‌దారుడు సెల్‌ఫోన్ వాడితే రూ.5వేలు, మ‌ద్యం తాగితే రూ.10 వేలు జ‌రిమానా విధిస్తున్నారు. మ‌రి రోడ్డు బాగోలేక వాహ‌న‌దారుడు రోడ్డుపై ప‌డితే ప్ర‌భుత్వానికి ఎంత జ‌రిమానా విధించాలి ? అని ప్ర‌శ్నించారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ట్వీట్ వైరల్ గా మారింది.

Related posts