telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు

rain hyderabad

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో పలు జిల్లాల్లో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే రాక ముందే రోకళ్లు పగిలిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీలకే పరిమితమైన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 43 డిగ్రీలు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.  తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణ ఛత్తీస్ ఘడ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1కి మీ వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని… నిన్న 0.9 కి మీ వద్ద ఏర్పడిన ఉత్తర-దక్షిణ ఆవర్తనం ఈ రోజు తెలంగాణా నుండి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి మీ వరకు ఉందని పేర్కొంది. దీంతో తెలంగాణాలోని తూర్పు, దక్షణములోని కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉండునున్నట్లు తెలిపింది. ఇక రేపు, ఎల్లుండి (6,7వ. తేదీలలో) పొడి వాతావరణము ఏర్పడే అవకాశం ఉందని… ఈ రోజు కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట మరియు నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Related posts